తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందు మాకు నియామక పత్రాలు ఇవ్వండి: టీఆర్టీ అభ్యర్థులు - TELANGANA CHOWK

టీఆర్టీలో ఎంపికైన తమకు ఉద్యోగాలు కల్పించకుండా కొత్తగా విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల కరీంనగర్​లో వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ చౌక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అభ్యర్థుల భిక్షాటన

By

Published : Apr 25, 2019, 8:59 PM IST

టీచర్ రిక్రూట్​మెంట్ టెస్ట్​లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకుండా విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్​లో టీఆర్టీ అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం తెలంగాణ చౌక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అభ్యర్థులు భిక్షాటన చేశారు. తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించాలి : అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details