పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. పై చదవుల కోసం ఒక్కొక్కరూ ఒక్కో చోటికి వెళ్లిపోయారు. చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లతో బిజీ బిజీగా గడిపారు. 25 ఏళ్ల తర్వాత పూర్వ స్నేహితులంతా ఒక్కచోటకి చేరారు. 1990లో పదవ తరగతి చదివిన విద్యార్థులు వేములవాడలోని ఆర్యవైశ్య సత్రంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తిరిగి కలుసుకున్నారు. తమ చిన్ననాటి గుర్తులను నెమరు వేసుకుంటూ ఆడిపాడారు. ఉపాధ్యాయులను సన్మానించారు. కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల పండుగ వాతావరణం నెలకొంది.
చదువులమ్మ చెట్టు నీడలో పూర్వ విద్యార్థులు - చదువులమ్మ చెట్టు నీడలో పూర్వ విద్యార్థులు
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం... చదువులమ్మ చెట్టు నీడలో... వీడలేమంటూ, వీడుకోలంటూ వీడిపోయిన విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలిశారు. అప్పుడు చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు.
చదువులమ్మ చెట్టు నీడలో పూర్వ విద్యార్థులు