కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రత్యేకించి సెలవు రోజుల్లో ఉద్యోగ, వ్యాపార వర్గాల వారు కుటుంబ సమేతంగా గాయత్రి పంపుహౌస్ చేరుకుని ఎత్తిపోతల పథకాన్ని వీక్షిస్తున్నారు. నిత్యం ఒక టీఎంసీ గోదావరి జలాలను తరలించే పంపుహౌస్ వద్ద పర్యటకులు బారులు తీరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గాయత్రి పంపుహౌస్ చూసేందుకు నిత్యం జనం తరలివస్తున్నారు.
గాయత్రి పంపుహౌస్ వద్ద సందర్శకుల సందడి - lift irrigation
కరీంనగర్ జిల్లా రామడుగులోని గాయత్రి పంపుహౌస్‌ను సందర్శించడానికి చుట్టుపక్కల ప్రజలు పోటెత్తుతున్నారు. ఎత్తిపోతల పథకాన్ని వీక్షించడానికి కుటుంబ సమేతంగా పర్యటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు.
గాయత్రిపంపుహౌస్ వద్ద సందర్శకుల సందడి