కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నాలుగు బాహుబలి పంపుసెట్లతో 12,600 క్యూసెక్కుల గోదావరి నదీ జలాలను ఎత్తిపోస్తున్నారు.
జల ప్రవాహం... గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు! - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నాలుగు బాహుబలి పంపుసెట్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. రోజూ ఒక టీఎంసీకి పైగా నీటిని మధ్య మానేరుకు తరలిస్తున్నారు.
గాయత్రి పంప్‌హౌస్ నుంచి కొనసాగుతున్న ఎత్తిపోతలు
ఈ నెల 17న పునః ప్రారంభించగా... సుమారు 10 టీఎంసీల వరకు ఎత్తిపోయనున్నారు. రోజూ ఒక టీఎంసీకి పైగా నీటిని ఎస్సారెస్పీ వరద కాలువ నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.
ఇదీ చదవండి:నేతాజీ జీవితం యువతకు ఆదర్శం: కిషన్ రెడ్డి