తెలంగాణ

telangana

ETV Bharat / state

FLOOD FLOW TO PROJECTS: ప్రాజెక్టులకు భారీగా చేరుతున్న వరద.. గేట్లు ఎత్తివేత.! - gates open at koyil sagar

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు(PROJECTS) నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీరాం సాగర్​, దిగువ మానేరు, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లను తెరిచి(GATES OPEN) అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

FLOOD FLOW TO PROJECTS
డ్యామ్స్​ గేట్లు ఎత్తివేత

By

Published : Sep 5, 2021, 1:37 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల(HEAVY RAINS)తో జలాశయాల(RESERVOIRS)కు వరద పోటెత్తుతోంది. శ్రీ రాం సాగర్​(SRI RAM SAGAR), దిగువ మానేరు(LOWER MANERU), కోయిల్​ సాగర్​(KOYIL SAGAR) ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. దీంతో ప్రాజెక్టుల నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిండుకుండలా శ్రీ రాం సాగర్​

నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​(SRI RAM SAGAR) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో 46,558 క్యూసెక్కులు ఉండగా.. 11గేట్ల ద్వారా 37,440 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 7,500 క్యూసెక్కులు దిగువకు విడదల అవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తానికి చేరుకుంది. శ్రీ రాం సాగర్​ పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తంలో కొనసాగుతోంది.

దిగువ మానేరు గేట్లు ఎత్తివేత

కరీంనగర్​ జిల్లా దిగువ మానేరు(LOWER MANERU) జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. మధ్యమానేరు, మోయతుమ్మెద వాగు నుంచి.. దిగువ మానేరుకు 78 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో అధికారులు.. డ్యామ్​ 16 గేట్లు ఎత్తి 91 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 22 టీఎంసీలుగా ఉంది.

కోయిల్​ సాగర్​కు వరద ప్రవాహం

వరద ఉద్ధృతితో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్​(KOYIL SAGAR) జలాశయం గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టుకు 4వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5 గేట్లు ఎత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:Rain Effect: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వరుణుడు.. మరో రెండురోజులు ఇదే పరిస్థితి

ABOUT THE AUTHOR

...view details