తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టర్​లో గంగుల ఫొటో.. తొలగించిన నిర్వాహకులు - ELECTION CODE

కరీంనగర్‌ కేంద్రంగా అంబేడ్కర్‌ స్టేడియంలో జాతీయస్థాయి బేస్‌బాల్‌ పోటీలు ఆలస్యంగా మెదలయ్యాయి. క్రీడాకారులు, నేతల రాకతో ఆలస్యం కాలేదు.. నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోస్టరులో ఓ రాజకీయ నేత ఫొటో ఉండటమే కారణం.

గంగుల

By

Published : Mar 29, 2019, 9:07 PM IST

పోస్టర్​లో గంగుల ఫోటో.. తొలగించిన నిర్వాహకులు
కరీంనగర్‌ కేంద్రంగా బేస్‌బాల్‌ పోటీలకు ఏర్పాట్లు జరిగాయి. క్రీడాకారులు, నిర్వాహకులు అందరూ వచ్చారు. పోటీల కోసం ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీపై చర్చ మొదలైంది. ఈ పోస్టర్​లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చిత్రం ఉండటమే ఇందుకు కారణం. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎమ్మెల్యే చిత్రం ఎందుకని చర్చ జరిగింది. ఎన్నికల కోడ్ గుర్తుకొచ్చి.. నిర్వాహకులు గంగుల చిత్రాన్ని తొలగించారు. ఇదంతా జరిగేసరికి క్రీడాపోటీలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

ఇవీ చూడండి :ఏ సమస్య వచ్చినా తెదేపా ఆదుకుంటుంది


ABOUT THE AUTHOR

...view details