తెలంగాణ

telangana

ETV Bharat / state

GANGULA KAMALAKAR: వేదికపై నుంచి కింద పడిన మంత్రి గంగులకు​.. స్వల్పగాయాలు - వేదిక కూలిపోవడంతో గంగులకు గాయాలు

gangula kamalakar
gangula kamalakar

By

Published : Apr 16, 2023, 3:28 PM IST

Updated : Apr 16, 2023, 4:59 PM IST

15:25 April 16

మంత్రి గంగుల కమలాకర్‌కు స్పల్ప గాయాలు

Minister Gangula Kamalakar Injured: చిరుతల రామాయణం ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వేదిక కుప్పకూలిపోవడంతో కిందపడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కరీంనగర్​ జిల్లాలోని చర్ల బూత్కూరులో చోటుచేసుకుంది. అక్కడ ఈ వేడుక ఏర్పాటు చేసిన వేదిక మీద అధిక సంఖ్యలో జనాలు కూర్చున్నారు. ఆ తర్వాత ఎక్కువ మంది రావడం స్టేజ్​ మీదకు రావడంతో.. బరువు మోయలేక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. వారి అందరినీ ఆసుపత్రికి తరలించారు. స్టేజ్​ కింద ఉన్న వారు ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే ఒక్కసారిగా వేదిక కూలిపోలియింది. భయాందోళనలో అక్కడ నుంచి పరుగులు తీశారు.

వెంటనే గాయాలైన మంత్రి గంగుల కమలాకర్​ను కరీంనగర్​ నగరంలోని ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. కాలు బెనకడంతో స్కాన్​ చేసి.. ఆర్థోపెడిక్​ కాలుకి చిన్న కట్టుకట్టారు. ఆ వెంటనే ఆసుపత్రి నుంచి డిశార్జ్​ చేశారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఆసుపత్రి లోపల నుంచి బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి..తన కాన్వాయ్​లో ఇంటికి చేరుకున్నారు.

గంగులకు గాయాలు కావడంతో.. పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. అతనికి ఎలా ఉందో తెలుసుకొని.. స్వల్ప గాయమే అయ్యిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి చేరుకున్న గంగుల కమలాకర్​ను పరామర్శించడానికి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​, కరీంనగర్​ మేయర్​ వై.సునీల్​ రావు, ఇంకా కరీంనగర్​ ముఖ్య నేతలు వెళ్లారు. తన యోగక్షేమాలను, సంఘటన ఎలా జరిగిందనే విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ముగ్ధంపూర్​లో జరిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి, కలెక్టర్​ ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు:ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచన మేరకు ఈ ఏడాది యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ యాసంగిలో ఒక్క ధాన్యం గింజ కూడా వదులుకోబోం.. ఒక్క రూపాయి బయటకు పోనివ్వమని అంతకు ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు కూడా చేశారు. అక్రమంగా ధాన్యం బయటకు పోకుండా ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగితే.. అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత 141 లక్షల మెట్రిక్​ టన్నులకు పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 16, 2023, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details