Gangula kamalakar Vs Bandi Sanjay in Karimnagar :భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అసెంబ్లీకి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపై ఉత్కంఠకు తెరపడింది. గత కొన్ని నెలలుగా కరీంనగర్ అసెంబ్లీ బరి నుంచి బండి సంజయ్ పోటీ చేయడం లేదని వార్తలు వెలువడ్డాయి. మళ్లీ పార్లమెంట్ స్థానానికే పోటీ చేస్తానని సంజయ్ చెబుతూ వచ్చారు.
కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar)ను ఎదుర్కొనే బీజేపీ అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 3 పర్యాయాలు గెలుపొందిన గంగుల కమలాకర్‌కు పోటీ ఎవరన్న అంశంపై గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్మెడ లక్ష్మీ నర్సింహరావు, బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ గట్టి పోటీ ఇచ్చారు.
Political Heat In Karimnagar : అయితే చల్మెడ లక్ష్మీ నర్సింహరావును వేములవాడ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు పోటీ చేయడానికి బండి సంజయ్ ఆసక్తి చూపకపోవడంతో అయోమయం నెలకొంది. అంతకుముందు బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనూ పార్టీ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో బండి సంజయ్(Bandi Sanjay) కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉండటం లేదంటూ చేసిన కామెంట్స్ సైతం తీవ్ర చర్చకు దారితీశాయి.
Bandi Sanjay Bike Rally In Vemulawada : 'బండి సంజయ్ ఎక్కడ పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది'
Bandi Sanjay Vs Gangula kamalakar :ఈ నేపథ్యంలోనే తాను అసెంబ్లీకి పోటీ చేయాలా.. పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలా అనే విషయంలో బండి సంజయ్ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారు. కరీంనగర్‌లోని మెజార్టీ కార్యకర్తలు బండి సంజయ్‌ని అసెంబ్లీ(Karimnagar Assembly Constituency)కి పోటీ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.