రైతు పండించిన పంట పది మందికి లాభదాయకంగా ఉండే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
'సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు' - రైతులు పండించే పంటపై గంగుల కమలాకర్
రైతులు పండించిన పంట అందరికీ లాభదాయకంగా ఉంటేనే అన్నదాతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
!['సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు' gangula kamalakar on farmerst harvesting crops](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7165291-thumbnail-3x2-gangula.jpg)
'సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు'
'సరిగ్గా సాగు చేస్తేనే రైతుకు బంగారు భవిష్యత్తు'
వానాకాలంలో వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. సాగు చేసుకుంటే మన సారవంతమైన భూములను పండించుకుంటే రాబోయే కాలంలో రైతుకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃహైదరాబాద్ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..