ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శమన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రాదేశిక ఎన్నికల గెలుపు ముఖ్యమంత్రికే దక్కుతుందని కమలాకర్ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మాదిరి ఇదే జోరును మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగిస్తామని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో తెరాస చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రాదేశిక ఎన్నికల్లో పట్టం కట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గంతో అభివృద్ధి పథంలో ముందుకెళ్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు వమ్ము చేయమని వెల్లడించారు.
ఈ విజయం ఆయనకే సొంతం! - Gangula
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం గులాబీ దళపతి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మున్సిపల్ ఎన్నికల్లోనూ... ఇదే జోరును కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్