కరీంనగర్ జిల్లా కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో కోతులు ఆహారం లేక విలవిలలాడుతున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయాన్ని కరోనా ఎఫెక్ట్‌తో మూసివేసినందున భక్తులు వెల్లకపోవడం వల్ల కోతులకు ఆహారం కరవైంది. కరీంనగర్‌కు చెందిన కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కోతులకు ఆహారంగా పండ్లను అందిస్తున్నాడు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు కోతులకు ఆహారం అందించడానకి దాతలు ముందుకు రావాలని ఆయన కోరుతున్నారు.
కోతులకు పండ్లు అందిస్తున్న కరీంనగర్ వాసి - fruits provided for monkeys at kondagattu
కరోనా ప్రభావం మనుషులపైనే కాదు... కోతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలోని కోతులు ఆహారం లేక విలవిలలాడుతున్నాయి. ఇది గమనించిన కరీంనగర్ వాసి ప్రతిరోజు పండ్లు అందిస్తూ... వాటి ఆకలి తీరుస్తున్నాడు. సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు.

కోతులకు పండ్లు అందిస్తున్న కరీంనగర్‌వాసి