కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. వేకువజూమున విద్యార్థులు అదృశ్యమైనట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. విద్యార్థులు షకీల్, అక్తర్, రఫీ, ఇజ్రాయిల్ తొమ్మిదో తరగతి చదువుతున్నారని తెలిపారు. విద్యార్థుల అదృశ్యంపై ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులు వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర వాసులని వెల్లడించారు. విద్యార్థుల అదృశ్యంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అక్కడ ఉండాల్సిన వాళ్లు ఎక్కడికెళ్లారు..? - Four students disappeared in Huzurabad minority Gurukul school
హుజూరాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థుల అదృశ్యంపై ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నలుగురు గురుకుల విద్యార్థుల అదృశ్యం