తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుంటే.. సుష్మ స్వరాజ్​ ఎలా మాట్లాడారు: వినోద్​కుమార్​ - భాజపా నేతలపై వినోద్​కుమార్​ ఫైర్​

ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కాల్సిన అవసరం ఏంటో బండి సంజయ్‌ చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానించిన ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

vinod kumar
vinod kumar

By

Published : Feb 10, 2022, 9:09 PM IST

తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుంటే.. సుష్మ స్వరాజ్​ ఎలా మాట్లాడారు: వినోద్​కుమార్​

ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కాల్సిన అవసరం ఏమిటో బండి సంజయ్‌ చెప్పాల్సిన అవసరం ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్​ చేశారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ప్రధాని మోదీ.. రాష్ట్రంలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు నిర్ణయించారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ప్రధాని, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్​లో ఓటింగ్ జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని బండి సంజయ్​ అడుగుతున్నారని ఎద్దేవా చేసిన వినోద్​కుమార్​.. అసలు ఆరోజు ఏం జరిగిందో సంజయ్​కు తెలుసా అని ప్రశ్నించారు. తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్​ చేశారని చెప్పారని.. అసలు ఏ బిల్లు పాస్​ చేసినా.. తలుపులు మూసివేస్తారని మీకు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగలేదంటున్న ప్రధాని... చర్చ జరగకుంటే సుష్మ స్వరాజ్ ఎలా మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు.

'ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కాల్సిన అవసరం ఏంటి. బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ప్రధాని మోదీ.. రాష్ట్రంలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి.'

-వినోద్‌ కుమార్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details