కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో తెరాస కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కాన్వాయ్‌ని ఈటల(Eatala Rajender) మద్దతుదారులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని పక్కకు తప్పించారు. అటు చల్లూరులో తెరాస కార్యకర్తల సమావేశంలో రసాభాస నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లేకుండా సమావేశం ఏమిటని పలువురు కార్యకర్తలు ప్రశ్నించారు.
Eatala Rajender: నారదాసు లక్ష్మణ్ రావును అడ్డకున్న ఈటల వర్గీయులు - తెలంగాణ వార్తలు
తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావును ఈటల రాజేందర్(Eatala Rajender) వర్గీయులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో తెరాస కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కాన్వాయ్‌ని ఈటల మద్దతుదారులు అడ్డుకున్నారు.
Eatala Rajender: నారదాస్ లక్ష్మణ్ రావును అడ్డకున్న ఈటల వర్గీయులు
వారికి సర్ది చెప్పేందుకు పలువురు నాయకులు ప్రయత్నించగా, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల పార్టీలో ఉన్నప్పటికీ సమావేశాలకు ఎందుకు పిలవటం లేదన్నారు. ఈటల జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో ఈటల వర్గీయులు సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:Asaduddin: మరోసారి లాక్డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్