కరీంనగర్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తన ఔదార్యం చాటుకున్నారు. అచేతన స్థితిలో పడి ఉన్న సుమారు 45 సంవత్సరాల వ్యక్తిని 108లో ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా సుందరగిరికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా కరీంనగర్ లో ఒంటరిగా గడుపుతున్నాడు. సమయానికి భోజనం దొరకకపోవడం వల్ల ఆరోగ్యము సహకరించలేకపోయింది. బక్క చిక్కి పోయిన శ్రీనివాస్‌ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు.
ఔదార్యాన్ని చాటుకున్న కరీంనగర్ మాజీ మేయర్ - mayor
కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
![ఔదార్యాన్ని చాటుకున్న కరీంనగర్ మాజీ మేయర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4813079-217-4813079-1571572434367.jpg)
ఔదార్యాన్ని చాటుకున్న కరీంనగర్ మాజీ మేయర్