కరీంనగర్ జిల్లా కేంద్రంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కేక్ కట్ చేసి.. మేరు కులస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మేరు కుల జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు.
టైలర్స్ డే వేడుకల్లో మాజీ మేయర్ - కరీంనగర్ మేయర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో.. మేరు కుల జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ హాజరయ్యారు.
టైలర్స్ డే వేడుకల్లో మాజీ మేయర్
మేరు కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రవీందర్ సింగ్ హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం కుల సంఘాలకు పక్కా భవనాలు నిర్మించడంతో పాటు అన్ని విధాల ఆదుకుంటోందని వివరించారు.
ఇదీ చదవండి:రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు