ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని శాసనమండలి మాజీ ఛైర్మన్, భాజపా నేత స్వామి గౌడ్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది' - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని శాసనమండలి మాజీ ఛైర్మన్, భాజపా నేత స్వామి గౌడ్ అన్నారు. విభజించు పాలించు సూత్రాన్ని ముఖ్యమంత్రి అవలంభిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది
సమస్యను పరిష్కరించడం మానేసి, విభజించు పాలించు సూత్రాన్ని ముఖ్యమంత్రి అవలంబిస్తున్నారని స్వామి గౌడ్ విమర్శించారు. ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. వర్సిటీలలో పూర్తి స్థాయిలో నియామకాలు లేకుండా పోయాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు..
ఇదీ చదవండి: కరోనా టీకా పంపిణీపై ప్రధాని భేటీలో సీఎం కేసీఆర్