కరీంనగర్ జిల్లా ఎలా బోతారం గ్రామంలోని చెరువులో కొండ చిలువ కలకలం సృష్టించింది. చెరువులో చేపలు పట్టేందుకు వర్షకాలంలో వలను ఏర్పాటు చేశారు మత్స్యకారులు. ఆ వలలో కొండచిలువ వచ్చి చిక్కుకుంది. చేపల వేటకు వెళ్లిన సందీప్.. వలలో ఉన్న కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు రంగంలోకి దిగారు.
ముందుగా కొండ చిలువ చనిపోయిందని జంతు సంరక్షణ అధికారి సుమన్ కుమార్ భావించాడు. వలను కట్ చేస్తుండగా కొండచిలువ పాకుతూ నీటిలోకి వెళ్లింది. దీంతో కొండ చిలువు బతికే ఉందని తెలుసుకున్న సుమన్.. దానిని రక్షించి.. మానకొండూరు శివారు అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ కొండ చిలువ సుమారు నాలుగు మీటర్ల పొడవు 40 కిలోల బరువు ఉందని సుమన్ తెలిపారు. కొండ చిలువను పట్టుకున్న సుమన్‌తో స్థానికులు సెల్ఫీలు దిగారు.