కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఈవీఎం పంపిణీ కేంద్రంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు ఓటు హక్కు కల్పించనిదే ఎన్నికల విధులకు హాజరయ్యేది లేదని ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగులు నిరసన తెలిపారు. అసలు తమ ఓట్లు ఎలా గల్లంతయ్యాయని కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌ను ప్రశ్నించారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సిందేనని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటేస్తాం అవకాశమివ్వండి.. ప్రభుత్వోద్యోగుల విజ్ఞప్తి - VTOLU
ఓటేయనిస్తేనే ఎన్నికల విధులకు హాజరవుతాం లేకుంటే లేదంటూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది.
ఓటేస్తాం అవకాశమివ్వండి.. ప్రభుత్వోద్యోగుల విజ్ఞప్తి
రేపు ఎన్నికల విధుల నిర్వహణకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిన పరిస్థితి. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు ఓటు హక్కును కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధిని వీడియో తీయొద్దంటూ జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: రేపు చింతమడకలో ఓటు వేయనున్న కేసీఆర్