సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలోని చెరువులో నాలుగు వేల చేపపిల్లలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విడుదల చేశారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే రసమయి - fish release into river at karimnagar
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేప పిల్లలను చెరువులోకి విడుదల చేశారు.
చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే రసమయి
అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, తెరాస శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్