First transgender gets loan in Telangana under PMEGP scheme : తెలంగాణలో మొట్టమొదటి సారిగా కరీంనగర్ జిల్లాలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు స్వయం ఉపాధి కోసం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పథకం కింద రుణం మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్‌కు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు రుణం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫొటో స్టూడియో కోసం రూ.5 లక్షల రుణం మంజూరు చేసినట్లు వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరీంనగర్ శాఖ ద్వారా మంజూరు చేసినట్లు చెప్పారు.
అనంతరం ఇంకొక ట్రాన్స్ జెండర్ నక్క సింధుకు కూడా ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా లేటెస్ట్ మేనేజర్ ఆంజనేయులు, ఎస్బీఐ ఏజీఎం శేఖర్, జిల్లా పరిశ్రమ కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పీడీ మెప్మా రవీందర్ బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.