తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలస్యంగా వచ్చారని.. వెనుకకు పంపారు - ఇంటర్‌ పరీక్షలు 2020

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్​ పరీక్షలు మొదటి రోజు ముగిసింది. కాగా మొదటి రోజు ఇంటర్మీడియట్​ ప్రథమ సంవత్సర పరీక్ష రాసేందుకు జమ్మికుంట పట్టణంలోని పరీక్ష కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. వారిని అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.

first day intermediate exams students late to the exam in karimnagar
ఆలస్యంగా వచ్చినందుకు వెనుకకు పంపారు

By

Published : Mar 4, 2020, 3:31 PM IST

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్రవంతి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి కల్యాణి, ప్రదీప్‌ అనే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారు. నిబంధనల ప్రకారం సమయం దాటిన తర్వాత పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని అధికారులు చెప్పారు. దీనితో విద్యార్థులు కంటతడి పెట్టారు. కల్యాణి ఇల్లంతకుంట మండలం సిరిసేడు నుంచి వచ్చానని, తనను అనుమతించాలని అధికారులను కోరగా ససేమిరా అనటం వల్ల విద్యార్థిని కంటతడి పెట్టింది. ప్రదీప్‌ తాను వరంగల్‌ నుంచి వచ్చానని చెప్పినప్పటికీ అధికారులు వినలేదు.

ఇద్దరు విద్యార్థులు తాము ఇంటర్‌ వృత్తి విద్యాకోర్సులో పరీక్ష రాసేందుకు వచ్చామని చెప్పారు. అధికారులు కేంద్రంలోకి అనుమతించక తిరిగి వెళ్లిపోయారు.

ఆలస్యంగా వచ్చినందుకు వెనుకకు పంపారు

ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

ABOUT THE AUTHOR

...view details