కరీంనగర్లో లాక్డౌన్ నియమాలు పాటించకపోతే ఇక జరిమానాలతో మోత మోగిస్తామంటున్నారు అధికారులు. నగరంలోని కాంచీట్ కూడలి వద్ద పండ్ల వ్యాపారులు లాక్డౌన్ నిబంధనలు పాటించలేదు. మాస్కులు లేకుండానే పండ్ల వ్యాపారం చేస్తున్నారు. భౌతిక దూరం కూడా పాటించలేదు.
మాస్కులు పెట్టుకోకపోతే జరిమానాల మోతే... - CORONA UPDATES
కరోనా మహమ్మారి విస్తరించకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా... కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి కరీంనగర్ అధికారులు జరిమానాలు విధిస్తూ... చర్యలు తీసుకుంటున్నారు.
మాస్కులు పెట్టుకోకపోతే జరిమానాల మోతే...
నియమాలు పాటించకుండా వ్యాపారం చేస్తున్న ఐదుగురికి రూ.100 చొప్పున అధికారులు జరిమానా విధించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ప్రజలను అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:నేటి నుంచి తెరుచుకోనున్న మద్యం దుకాణాలు
Last Updated : Apr 13, 2020, 5:04 PM IST