తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయితీని ఎత్తేసిన చమురు కంపెనీలు.. ఆర్టీసీ సంస్థపై ఆర్థిక భారం - కరీంనగర్‌ రీజియన్ పరిధి

డీజిల్‌ ధరల పెరుగుదల ఆర్టీసీపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. చమురు కంపెనీలు టోకుగా సరఫరా చేస్తే ఇచ్చే రాయితీని ఎత్తేశాయి. రెండున్నర నెలల నుంచి కరీంనగర్ రీజియన్‌ పరిధిలో... రిటైల్‌లో డీజిల్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీపై సుమారు 49 కోట్ల ఆర్థిక భారం పడింది. ప్రస్తుతం వాణిజ్య బంకుల్లో అందరితో సమానంగా డీజిల్ కొనుగోలు చేస్తున్నారు.

Financial burden on TSRTC because Oil companies lift subsidies
Financial burden on TSRTC because Oil companies lift subsidies

By

Published : May 2, 2022, 5:30 AM IST

Updated : May 2, 2022, 6:31 AM IST

రాయితీని ఎత్తేసిన చమురు కంపెనీలు.. ఆర్టీసీ సంస్థపై ఆర్థిక భారం

కరీంనగర్‌ రీజియన్ పరిధిలో పది డిపోలుండగా మొత్తం 841 బస్సు సర్వీసులు నిత్యం 3లక్షల 42వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. 2లక్షల 56వేల మంది ప్రయాణీకులను చేరవేస్తుంటాయి. దీనికిగాను ప్రతిరోజు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 71లక్షల రూపాయల డీజిల్‌ను ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. నిత్యం సగటున 65 వేల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీ.. నేరుగా చమురు కంపెనీల నుంచి టోకుగా కొనుగోలు చేసేది. టోకుగా సరఫరా చేసే డీజీల్‌ ధరలు అమాంతం పెరగడంతో.... ఫిబ్రవరి 17 నుంచి రిటైల్‌లో కొంటున్నారు. కరీంనగర్‌లోని.. రెండు బంకులతోపాటు హుజూరాబాద్‌, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ, సిరిసిల్ల, గోదావరిఖని, మంథని డిపోలలోని పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి.

కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీతోపాటు అద్దె బస్సులు మొత్తం ప్రతిరోజు 2లక్షల56వేల ప్రయాణీకులను చేరవేస్తుండటంతో సంస్థకు 1.13కోట్ల రూపాయల రాబడి వస్తోంది. అయితే ఇందులో సింహభాగం 71లక్షల రూపాయలు ఇంధన కొనుగోలుకే వెచ్చించాల్సి వస్తోంది. కిలోమీటర్‌కు 22.80పైసల ఇంధనం వాడుతుండగా.. ఒక్క మార్చి నెలలోనే 21 కోట్ల రూపాయల ఇంధనాన్ని కొనుగోలు చేశారు. కేవలం సంస్థ బస్సులే కాకుండా అద్దె బస్సులకు కూడా సంస్థ ఇంధనం సరఫరా చేస్తోంది. ప్రతి బస్సు బంకుకు వెళ్లి రావటంతో కొంత డీజిల్‌ వృథా అయ్యే అవకాశం ఉండటంతో.. అధికారులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఆర్టీసీ డిపోల్లో డీజిల్‌ లభిస్తే వాహనాలకు నాణ్యత గల ఇంధనం లభించడమే కాకుండా ఆర్థిక భారం తక్కువగా ఉండేది. ఇంధన ధరలు పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణీకులు బస్సుల్లో సాధ్యమైనంత మేర అధికంగా ఎక్కే విధంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చూడండి:

Last Updated : May 2, 2022, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details