ఈ నెల 16న కరీంనగర్ జిల్లా శాలపల్లి ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఇందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలోనే కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామసభల ద్వారా గ్రామాల్లో దళిత బంధు సాయం పంపిణీ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అర్హులైన దళితుంలదరికీ దళిత బంధు అందిస్తామని స్పష్టం చేశారు.
CM KCR Public Meeting: 16న సీఎం సభ... సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష - తెలంగాణ వార్తలు
శాలపల్లిలో సీఎం కేసీఆర్ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
![CM KCR Public Meeting: 16న సీఎం సభ... సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష somesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12768547-251-12768547-1628931404064.jpg)
సోమేశ్ కుమార్
సీఎం సభ జనసమీకరణ కోసం ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. బస్సుల్లో జనాలను తరలించేలా పంతుళ్లకు సూచనలు చేశారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి రావాలని కరీంనగర్ డీఈవో ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం ఎస్సీల ధర్నా
Last Updated : Aug 14, 2021, 2:27 PM IST