ఆమెకు ధైర్యమెక్కువ. సాహసాలు చేయడమంటే చాలా సరదా. అందుకే ఏ మహిళా ఎంచుకోని రంగాన్ని ఎంచుకుంది. పాములు పట్టేందుకు(SNAKE CATCHER) సిద్ధమైంది. చిమ్మ చీకట్లోనైనా.. గుబురు పొదల్లోనైనా పాము ఉందంటే చాలు ఇట్టే కనిపెట్టేస్తుంది. కేవలం శబ్దంతోనే పాములను ఎంచక్కా పట్టేసి బంధించేస్తుంది. ఆమె సర్పాలను పట్టడాన్ని చూస్తే... ఓస్ పాముల(SNAKES)ను బంధించడం ఇంత సులువా అనిపిస్తుంది. ఆమే కరీంనగర్ జిల్లాకు చెందిన షబానా.
చిమ్మ చీకట్లో.. శబ్ధం ఆధారంగానే..
కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలో మంగళవారం రాత్రి ఓ నాగుపాము(SNAKE) హడలెత్తించింది. తొలుత వెంకటరమణ ఇంట్లో కనిపించిన సర్పం ఆ తర్వాత మరో రెండు ఇళ్లలోకి దూరి తప్పించుకునే ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న 55వ డివిజన్ కార్పొరేటర్ జితేందర్(CORPORATOR) పాములు పట్టే వారికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న షబానా... విద్యుద్దీపాలను ఆర్పేసింది. చిమ్మ చీకట్లోనే సర్పం శబ్దాన్ని గుర్తించి... క్షణాల్లో పామును(FAMALE SNAKE CATCHER) పట్టేసింది. అనంతరం ఆ పామును అందరికీ చూపిస్తూ... భయపడాల్సి అవసరమేం లేదని చెప్పింది. తర్వాత సర్పాన్ని ప్లాస్టిక్ సీసా(PLASTIC BOTTLE)లో బంధించింది.