తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రమాద రహిత ముగింపు వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో డ్రైవర్లను.. డిపో మేనేజర్ సత్కరించారు. గత 30 ఏళ్లుగా ప్రమాద రహిత డ్రైవర్లను గుర్తించిన ఆర్టీసీ అధికారులు శాలువా, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. మిగతా డ్రైవర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఆర్టీసీలో ప్రమాద రహిత వాహన చోదకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.
ఉత్తమ డ్రైవర్లను కరీంనగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఫారుక్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అభినందించారు. ప్రమాద రహిత డ్రైవర్లకు నగదు పురస్కారంతో పాటు ఇంక్రిమెంట్లు ఇస్తే బాగుండేదని మధుసూదన్ ఆర్టీసీ అధికారులను కోరారు.
ప్రమాద రహిత ఆర్టీసీ వాహన చోదకులకు సన్మానం - కరీంనగర్
రాష్ట్ర రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాలు కరీంనగర్ జిల్లాలో జరిగాయి. ఇందులో భాగంగానే ప్రమాద రహిత వాహన చోదకులను సన్మానించారు.
rtc
ఇవీ చూడండి : రెండు రోజులు వైన్‌షాపులు బంద్
Last Updated : Jul 31, 2019, 3:01 PM IST