ఇండియన్ ఆర్మీకి ఎంపికై.. శిక్షణ పూర్తి చేసుకున్న కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన లక్ష్మణ్‌కు స్వేరోస్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీఎస్ ఛైర్మన్ అల్వాల కోటి జవాన్‌ను శాలువాతో సత్కరించారు.
ఆర్మీ జవాన్‌కు సన్మానం - karimnagar distirct news
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్లలో ఆర్మీ జవాన్ లక్ష్మణ్‌కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ అల్వాల కోటి పాల్గొన్నారు.
ఆర్మీ జవాన్‌కు సన్మానం
గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించి భారత సైన్యంలో ఉద్యోగం సంపాదించడం గ్రామానికే గర్వకారణమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సంపత్, ముస్తఫా పాల్గొన్నారు.