తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ జమ్మికుంటలో ట్రాక్టర్లతో ర్యాలీ - కరీంనగర్​ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జమ్మికుంటలో రైతులు ర్యాలీ చేశారు.

నూతన రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ జమ్మికుంటలో ట్రాక్టర్లతో ర్యాలీ
నూతన రెవెన్యూ చట్టాన్ని హర్షిస్తూ జమ్మికుంటలో ట్రాక్టర్లతో ర్యాలీ

By

Published : Sep 25, 2020, 3:09 PM IST

కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ జిందాబాద్‌ అంటూ నినదించారు.

స్థానిక అయ్యప్ప ఆలయం నుంచి గాంధీ చౌక్‌ వరకు సుమారు 500 ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని జడ్పీఛైర్​పర్సన్​ కనుమల్ల విజయ, మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు ప్రారంభించారు. నూతన చట్టంతో రైతుల ఇబ్బందులు తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బడి బియ్యం.. పురుగులపాలు!

ABOUT THE AUTHOR

...view details