కరీంనగర్ - సిరిసిల్ల రహదారిపై గంగాధర మండల రైతులు రాస్తారోకో చేశారు. నాణ్యత ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రంలో తిరస్కరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దానితో ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
నాణ్యత ఉన్న ధాన్యాన్ని కూడా కొనడం లేదు: గంగాధర రైతులు - గంగాధర రైతుల నిరసన తాజా వార్త
నాణ్యత ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధాన్యాన్ని కొనేవరకు ఆందోళన విరమించేది లేదంటూ కరీంనగర్- సిరిసిల్ల రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
నాణ్యత ఉన్న ధాన్యాన్ని కూడా కొనడం లేదు: గంగాధర రైతులు
అధికారులు స్పష్టమైన హామి ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదంటూ అన్నదాతలు భీష్మించుకు కూర్చున్నారు. చివరికి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తే ఇక్కడి అధికారులు మాత్రం అలా చేయడం లేదంటూ వాపోయారు. చివరకు గంగాధర, కొత్తపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇదీ చూడండి:రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు: మంత్రి గంగుల కమలాకర్