తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనట్లేదని రైతన్నల ఆందోళన - DATTOJIPETA RYTHULA ANDOLANA

ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు ఆందోళన చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన చేపట్టారు. అధికారులు పలు కారణాలు చూపి జాప్యం చేస్తున్నారని వాపోయారు.

FARMERS PROTESTING FOR NOT PURCHASING PADDY
ధాన్యం కొనట్లేదని రైతన్నల ఆందోళన

By

Published : Apr 29, 2020, 2:38 PM IST

ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. పక్షం రోజులు గడుస్తున్నా అధికారులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన చెందారు. తాలు, హమాలీల కొరత, లారీల కొరత లాంటి కారణాలు చెబుతూ జాప్యం చేస్తున్నారని అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు.

రైతులు భౌతిక దూరాన్ని పాటించి రహదారిపై బైఠాయించారు. వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ గంట్ల వెంకట్​ రెడ్డి, సహకార సంఘం సీఈవో మల్లేశం అక్కడికి చేరుకుని తూకం మొదలుపెట్టడానికి చర్యలు తీసుకోగా రైతులు ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

ABOUT THE AUTHOR

...view details