తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు - Farmers' protest in Karimnagar to buy grain

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతో పాటు, రామడుగు మండల కేంద్రంలో రహదారిపై బైఠాయించి ఆందోళన తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు

By

Published : Nov 25, 2019, 5:47 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతోపాటు... రామడుగు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు. నెల రోజులుగా ఎదురు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చొప్పదండి పట్టణంలో... కరీంనగర్-మంచిర్యాల రహదారిపై బైఠాయించారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పారు. రామడుగు మండలంలో రైతులతో చర్చించిన తహసీల్దార్​ ఉన్నతాధికారులతో సంప్రదించి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు నిరసన విరమించారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details