కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటలో మండల వ్యవసాయ అధికారిణి కిరణ్మయి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న, పత్తి పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అవగాహన కల్పించారు. కత్తెర పురుగుతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెగుళ్ల నివారణకు ఉపయోగించే బయో, రసాయన ఎరువులు వాడే పద్ధతిని క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులతో కలిసి పంట చేలను పరిశీలించారు.
పంట తెగుళ్ల నివారణపై శాస్త్రవేత్తల సూచనలు - కత్తెర పురుగు నివారణ
పంట తెగుళ్ళ నివారణకు సస్యరక్షణ చర్యలు పాటించాలని కరీంనగర్ జిల్లా ఖాసీంపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు సూచించారు. మొక్కజొన్నను పీడిస్తున్న కత్తెర పురుగు నివారణకు తొలిదశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కర్షకులకు అవగాహన కల్పించారు.

Farmers' awareness seminar on pests in kasimpet
పంట తెగుళ్ల నివారణపై శాస్త్రవేత్తల సూచనలు...
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!