యాసంగి పంట ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరిట కోత విధిస్తున్నారని కరీంనగర్ జిల్లా రామడుగులో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధిస్తుండటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదనవ్యకం చేశారు.
'ధాన్యం కోతపై అధికారులు స్పందించాలి' - FARMERS AND TDP LEADERS PROTESTED AGAINST RICEMILLERS
కరీంనగర్ జిల్లా రామడుగులో తాలు పేరిట రైస్ మిల్లర్లు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన చేశారు. ఈ విషయంపై అధికారులు ఏమాత్రం స్పందించట్లేదని తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి అంబటి జోజి రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

'ధాన్యం కోతపై అధికారులు స్పందించాలి'
మరోవైపు ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు తిరస్కరిస్తుండటం వల్ల తామూ ఏం చేయలేకపోతున్నామని ధాన్యం కొనుగోలు చేసే మహిళా సంఘాలు కూడా చేతులెత్తేశారు. దీనిపై అధికారులు కూడా స్పందించకపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు.