తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు నిరాహారదీక్ష - farmer nirahara deeksha infront of mro office

తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిని వేరే వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేశారని ఓ రైతు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో జరిగింది.

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు నిరాహారదీక్ష

By

Published : Jun 27, 2019, 2:31 PM IST

కరీంనగర్​ జిల్లా చెంజర్లకు చెందిన రాజిరెడ్డి అనే రైతు మానకొండూరు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టాడు. తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వ భూమిని వేరే వాళ్ల పేరు మీద రిజిస్టర్​ చేసి అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించాడు. రాజిరెడ్డికున్న ఐదెకరాల భూమిలో మూడున్నర ఎకరాలు ఆన్​లైన్​లో పొందుపరచగా... మరో ఎకరంన్నర కోసం మాత్రం అధికారులు కనికరించడంలేదని వాపోయాడు. గతంలో తహశీల్దార్​ కార్యాలయం ఎదుట దీక్షకు దిగగా ఎమ్మార్వో శ్రీనివాస్​ హామీపై దీక్ష విరమించారు. ఇప్పటికీ పరిస్థితి కొలిక్కిరానందున మరోసారి నిరాహారదీక్షను తిరిగి ప్రారంభించారు.

రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు నిరాహారదీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details