తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.22.18 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటం వల్ల విత్తనాలకు గిరాకీ పెరిగింది. ఇదే అదునుగా అన్నదాతల అమాయకత్వంతో వ్యాపారులు ఆడుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుర్శేడు గ్రామంలో రూ.22.18 లక్షల విలువైన పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు.

రూ.22.18 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

By

Published : Jun 24, 2019, 7:40 PM IST

కరీంనగర్ జిల్లా దుర్శేడు గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన పత్తి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. దుర్శేడు గ్రామ శివారులో ఓ డైరీ ఫారం షెడ్డును కిరాయికి తీసుకుని నకీలీ పత్తి విత్తనాలను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 1,350 కిలోల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 22.18లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

రూ.22.18 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

ABOUT THE AUTHOR

...view details