తెలంగాణ

telangana

ETV Bharat / state

fake news spread: ఫేక్​న్యూస్ పోస్ట్ చేసినందుకు పోలీసుల వార్నింగ్ - పాము సంచరిస్తోందని పుకారు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో ఆగ్నస్ పాము సంచరిస్తోందని పుకారు సృష్టించిన యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాంటి వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

 fake news spread in social media
fake news spread: పోలీసుల అదుపులో యువకుడు

By

Published : Jun 7, 2021, 7:51 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో ఆగ్నస్ పాము సంచరిస్తోందని వదంతి సృష్టించిన యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వెలిచాల యూకలిప్టస్ చెట్లలో సంచరిస్తోందని సామాజిక మాధ్యమాల్లో అతను ప్రచారం చేశాడు.

దీంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు పోలీసులకు తెలపడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేస్తే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై వివేక్ హెచ్చరించారు.

ఇదీ చూడండి:Harish Rao : కలెక్టర్ జీతం కంటే.. రైతుకు వచ్చే లాభాలెక్కువ

ABOUT THE AUTHOR

...view details