కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగశాయిపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగశాయిపల్లిలో మకాం వేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు అనుమానితుని ఇంటిపై దాడి చేసి నాలుగు కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 200 లీటర్ల నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ విత్తనాలను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు - taskforce raid on fake seeds
అధికారులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా నకిలీ విత్తనాలు చలామణి అవుతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రంగశాయిపల్లిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కిలోల పత్తి విత్తనాలు, 200 లీటర్ల నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ విత్తనాలను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
ఈ కేసులో నిట్టు తిరుమల్, వేముండ్ల కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన రంగు మల్లయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి: అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న రైతు అరెస్టు