Faculty shortage in Satavahana University : శాతవాహన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి 15 ఏళ్లు గడిచినా..ఇప్పటి వరకు మంజూరైన పోస్టులు భర్తీచేయలేకపోయారు. అన్ని విభాగాల్లోను ఒప్పంద అతిధి ఆచార్యులే ఎక్కువగా ఉన్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక కొత్త కోర్సులను ప్రవేశపెట్టి ఉపాధి మార్గాలను పెంచాల్సి ఉండగా అది జరగకపోవడం విద్యార్ధులకు ఇబ్బందిగా మారింది. సమస్యలను పరిష్కరించాలని విద్యార్ది సంఘాలు ఆందోళన చేపట్టినా..పట్టించుకొనే వారు కరవయ్యారు.
Satavahana University Faculty shortage :ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నత చదువు కోసం 2008లో ప్రభుత్వం శాతవాహన విశ్వవిద్యాలయంఏర్పాటు చేసింది. వర్సిటీ ప్రారంభించిన క్రమంలో 63మంది బోధన సిబ్బంది పోస్టులు మంజూరు చేస్తూ 22మందిని నియమించింది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు పూర్తి చేయలేదు. పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విన్నవించే వారు లేకపోవడంతో నియమించిన అధ్యాపకులలో నుంచి ఆరుగురు పదవీ విరమణ చేశారు. పర్యవసానంగా ప్రస్తుతం 16మందితోనే విశ్వవిద్యాలయంలో విద్యార్ధులకు బోధనలు జరుగుతున్నాయి.
''తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాలైనా శాతవాహన విశ్వవిద్యాలయంలో అధ్యాపకులను నియమించలేక పోతుంది. 16 మందితోనే విశ్వవిద్యాలయంలో విద్యార్ధులకు బోధన జరుగుతోంది. ప్రశ్నించిన విద్యార్థులను పరీక్షల పేరుతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. విద్యాశాఖలో అధ్యాపకులను నియమించడం పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుందని మేం తెలంగాణ సర్కార్ను ప్రశ్నిస్తున్నాం.'' - విద్యార్ధులు
Teacher shortage in Satavahana College : విశ్వవిద్యాలయంలో చాలా వరకు అన్ని విభాగాల్లోను ఒప్పంద అతిధి ఆచార్యులే ఎక్కువగా ఉన్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ చదువులోనే కాకుండా.. హాస్టళ్లలోనూ విద్యార్దులుఅనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. సరైన రక్షణ కరవైందంటున్నారు. అధ్యాపకుల నియామకాల్లోను అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.