శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో ఆయన అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్‌లో ఏర్పాటుచేసిన జన్మదిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు హాజరై కేక్ కట్ చేశారు. కేక్‌ను తినకుండా మేయర్ వెళ్లిపోయిన తర్వాత అభిమానులు దానిని పక్కకు పడేసి వెళ్లిపోయారు.
కొవిడ్ భయం... కేక్‌ను పక్కన పడేసి వెళ్లిపోయారు.. - కరీంనగర్ వార్తలు
కరీంనగర్లో మాజీ స్పీకర్ మధుసూదనా చారి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కొవిడ్ భయంతో కేక్ కట్ చేసిన అనంతరం దానిని తినకుండానే పక్కన పడేసి వెళ్లిపోయారు.

కొవిడ్ భయం... కేక్‌ను పక్కన పడేసి వెళ్లిపోయారు..
కొవిడ్ భయంతో కేక్‌ను పడేసి వెళ్లిపోయారు. అభిమానులు మొక్కలు పంపిణీ చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేక్ కట్ చేయడం కాకుండా తమ అభిమానాన్ని చాటుకునేందుకు ఇతర మార్గాలను ఎంచుకోవాలని నాయకులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'భయపడేది లేదు... ప్రజల పక్షాన పోరాటంలో రాజీపడే ప్రసక్తేలేదు'