తెలంగాణ

telangana

ETV Bharat / state

etela rajender: 'హుజూరాబాద్​ ప్రజలతోనే నియంతృత్వ పాలనకు చరమగీతం'

తెలంగాణ ప్రజల చెమట చుక్కలతోనే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయని.. కేసీఆర్​ డబ్బులతో కాదని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ విమర్శించారు. ఎంతమంది అమ్ముడుపోయినా హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలు డబ్బుకు అమ్ముడుబోరని స్పష్టం చేశారు. హుజూరాబాద్​లో నియోజక వర్గ స్థాయి భాజపా నేతలతో ఈటల సమావేశం నిర్వహించారు. తెరాసది అవినీతి పాలన అంటూ సమావేశంలో ఈటల విమర్శలు గుప్పించారు.

etela rajender comments on cm kcr
కేసీఆర్​పై ఈటల విమర్శలు

By

Published : Jun 20, 2021, 8:19 PM IST

హుజూరాబాద్​ ప్రజలతోనే నియంతృత్వ పాలనకు చరమగీతం

తాను తెరాస నుంచి వెళ్లలేదని, ఆ పార్టీ నేతలే వెళ్లగొట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఆత్మగౌరవం అంటే తనది కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమని స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి భాజపా కార్యకర్తల సమావేశాన్ని ఈటల రాజేందర్​ నిర్వహించారు. సీఎం కేసీఆర్​ పాలనపై విమర్శలు గుప్పించారు.

2018 ఎన్నికల్లో రాష్ట్రంలో తెరాసకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేబినెట్‌ లేకుండా నడిపిన చీకటి చరిత్ర కేసీఆర్‌ది. మాకు నేరుగా ముఖ్యమంత్రి దొరకడు. మధ్యవర్తుల ద్వారా మాత్రమే ఆయన అపాయింట్​మెంట్​ దొరుకుతుంది. ఎంతమంది అమ్ముడుపోయినా, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోరు. -ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, భాజపా నేత

తెలంగాణ ప్రజల చెమట చుక్కలతోనే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయని.. కేసీఆర్​ సొంత డబ్బుతో కాదని ఈటల ఎద్దేవా చేశారు. హుజూరాబాద్​ ఉప ఎన్నికల నిర్వహణలో అవినీతి జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ముందుగానే దరఖాస్తు పంపినట్లు చెప్పారు. రాబోయే కేసీఆర్​ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేది హుజూరాబాద్​ ప్రజలేనని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:KTR:హైదరాబాద్​లో వ్యాక్సిన్​ టెస్టింగ్​ సెంటర్​ ఏర్పాటుచేయండి: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details