రాజకీయాలకు అతీతంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 38వ డివిజన్లో ఎంపీ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
'పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి' - updated news on Everyone wants to be partners in urban progress
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్‌కుమార్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
కాలనీలో వదులుగా ఉన్న పలు విద్యుత్ తీగలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని.. అందరూ కలిసి పనిచేస్తేనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి, విద్యుత్ శాఖ సూపరింటిండెంట్ మాధవరావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఐనవోలులో బీరు సీసాతో గొంతుకోసి హత్య