కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం ఉండదని కరీంనగర్ ఆర్‌ఎంఓ డాక్టర్ శౌరయ్య సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీరియస్ కేసులన్నీ జిల్లా ఆసుపత్రికే వస్తున్నాయని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత లేదని అత్యవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
'లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి' - ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత లేదని.. అత్యవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయని ఆర్‌ఎంఓ డాక్టర్ శౌరయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సీరియస్ కేసులన్నీ ఇక్కడికే వస్తున్నాయని వెల్లడించారు. ఆస్పత్రిలో కల్పిస్తున్న సదుపాయాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
కరీంనగర్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శౌరయ్య
దాదాపు 300 పడకలు ఉండగా కేవలం 145 మంది మాత్రమే కొవిడ్ రోగులు ఉన్నారని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో మొత్తం 40 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా ప్రత్యేకంగా కరోనా రోగుల కోసం 33 కేటాయించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 మంది మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు ఎలాంటి కొరత లేదని ఆర్‌ఎంఓ శౌరయ్య స్పష్టం చేశారు.