తెలంగాణ

telangana

ETV Bharat / state

Vaccination: 'గుర్తింపు ప్రక్రియ తర్వాత.. వారందరికీ వ్యాక్సినేషన్‌' - సూపర్​ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సినేషన్​పై మేయర్​ సునీల్​ రావుతో ముఖాముఖి

కరీంనగర్ నగరపాలక పరిధి(karimnagar municipal corporation)లో సూపర్‌స్ప్రెడర్ల(super spreaders)ను గుర్తించేందుకు డివిజన్ల వారీగా సర్వే నిర్వహిస్తున్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. వీధివ్యాపారులను నగరపాలక సంస్ధ నుంచి తీసుకొనే లైసెన్సుల ఆధారంగా వారిని గుర్తిస్తామని వెల్లడించారు. కేవలం కూరగాయల వ్యాపారులే కాకుండా అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నవారి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందంటున్న మేయర్ సునీల్‌రావుతో 'ఈటీవీ భారత్​' ముఖాముఖి..

corona vaccination to super spreaders in karimnagar
కరీంనగర్​లో సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సినేషన్​

By

Published : Jun 4, 2021, 2:02 PM IST

'నగరంలో సుమారు 35వేల మంది వరకు సూపర్​ స్ప్రెడర్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. 15వేల మంది వరకు వీధి వ్యాపారులు ఉన్నారు. డివిజన్ల వారీగా వారి వివరాలు సేకరిస్తున్నాం. టోకెన్లు లేదా ఫోన్​ ద్వారా సమాచారమిచ్చి 15 రోజుల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తాం. అంతే కాకుండా లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.'

సునీల్​ రావు, కరీంనగర్​ నగరపాలక సంస్థ మేయర్

గుర్తింపు ప్రక్రియ తర్వాత అర్హులందరికీ వ్యాక్సినేషన్​: మేయర్​ సునీల్​ రావు

ఇదీ చదవండి:KTR: మంత్రి చొరవ.. రూ.4 లక్షలు వెనక్కి

ABOUT THE AUTHOR

...view details