ఆరు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులపై... 'పాపం పసివాళ్లు' పేరిట ఈటీవీ తెలంగాణ ప్రసారం చేసిన కథనానికి అపూర్వ స్పందన లభిస్తోంది. అమెరికాలోనిఎన్నారైలు పంజాల నరేశ్, మధుప్రియల ఆధ్వర్యంలో పలువురు ఎన్నారైలు కలిసి చిన్నారులు అభినయ, ఆలయ పేరిట ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఆయా చెక్కులను బాధిత చిన్నారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లిలో అభినయ, ఆలయ అనే చిన్నారులు..తల్లిదండ్రులను కోల్పోయారు. బాబాయ్ సంరక్షణలో ఉన్న చిన్నారుల భవిష్యత్ కు భరోసా ఇవ్వాలని కోరుతూ... గతనెల 20న ఈటీవీ తెలంగాణలో కథనం ప్రసారమైంది. ఈ కథనానికి స్పందించిన మానవతామూర్తులు ... ఇప్పటి వరకు ఒక్కొక్కరి పేరిట 4 లక్షలకు పైగా ఆర్థికసాయం అందించారు.
అపూర్వ స్పందన...