తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Rajender: ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. - తెలంగాణ తాజా వార్తలు

ఈటల రాజేందర్​ రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్​ ఉపఎన్నిల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​పై ఈటల విజయం సాధించారు.

Etela Rajender
Etela Rajender

By

Published : Nov 9, 2021, 8:24 PM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్..​ రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్టోబర్​ 30న ఉపఎన్నికలు జరగ్గా.. నవంబర్​ 2న ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​పై ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఉపఎన్నిక సందర్భంగా అధికార తెరాస రూ.వందల కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల రాజేందర్​ ఆరోపంచారు. అయినా హుజూరాబాద్​ ప్రజలు తననే ఆశీర్వదించారని చెప్పారు. హుజురాబాద్‌ ప్రజలను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. భాజపా నేతలు తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు అన్ని వర్గాలు పనిచేశాయని తెలిపారు. ఈటల గెలిస్తే అందరూ గెలిచినట్లే భావించారని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది.

తెరాసలో ఏడేళ్లు మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ అధిష్టానానికి పొసగలేదు. పదవి తనకు ప్రజలు పెట్టిన భిక్షంటూ ఈటల బాహాటంగానే పలుసార్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలపైనా సునిషిత విమర్శలు చేశారు. ధనికులకు రైతు బంధు పథకం అమలు సహా గొర్రెలు, బర్రెలు పంపకాలపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఓ మంత్రిగా ఈటల అసంతృప్తి తెరాస పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఈటల భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ అధిష్ఠానం మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసింది. అసైన్డ్‌ భూములు ఆక్రమించారంటూ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ పరిణామాలన్నీ ముందే అంచనా వేసిన ఈటల రాజేందర్‌ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అధికారపక్షాన్ని ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నారు. భాజపాలో చేరి తెరాసకు సవాల్‌ విసిరారు.

ఇదీచూడండి:Bandi sanjay comments on kcr speech: కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్..

ABOUT THE AUTHOR

...view details