తెలంగాణ

telangana

ETV Bharat / state

ETELA: 'తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారు'

తెరాస సర్కారు గాడి తప్పిందని... ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎన్నికల కోసమే పనిచేస్తోందని... ప్రజల కోసం కాదని ఆరోపించారు.

ETELA: 'తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారు'
ETELA: 'తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారు'

By

Published : Jul 7, 2021, 4:45 PM IST

తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి తప్పా... ఇష్టానికి లోబడి పని చేయొద్దని సూచించారు. హుజూరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మండలానికో మంత్రి ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎన్నికలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రలోభపెట్టడం తప్పా 57 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇచ్చారా అంటూ మంత్రులను ప్రశ్నించారు. ఇప్పటివరకు కొత్త రేషన్​ కార్డులు ఇచ్చారా అంటూ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నికల కోసమే పనిచేస్తోందని... ప్రజల కోసం కాదని విమర్శించారు.

సర్పంచ్​లు, కార్యకర్తలను భయపెట్టి, ప్రలోభపెట్టి తెరాసలో చేర్చుకుంటున్నారని ఈటల ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండదన్నారు. ఇప్పటికే తెరాస ప్రభుత్వం గాడితప్పిందని విమర్శించారు. హుజూరాబాద్​లో గెలిచేది భాజపా పార్టీనేనని... ఎగిరేది కాషాయ జెండానేనని ఈటల రాజేందర్​ ధీమా వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో గోబెల్స్​ ప్రచారాన్ని తిప్పికొట్టి ధర్మాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు, కార్యకర్తలకు సూచించారు. రేపటి ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. కమలం గుర్తుకు ఓటేసి తనను ప్రజలకు ఈటల రాజేందర్​ విజ్ఞప్తి చేశారు.

కాషాయజెండా ఎగురుతుంది..

సామాజిక మాధ్యమాల్లో తప్పు ప్రచారాలను నమ్మొద్దు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలి తప్పా... ఇష్టానికి పనిచేయొద్దు. హుజూరాబాద్​లోనే కాదు రాష్ట్రంలోని ప్రజలందరూ తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని భావిస్తున్నరు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగురుతుంది. సామాజిక మాధ్యమాల్లో గోబెల్స్​ ప్రచారాన్ని తిప్పికొట్టి ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలి. -ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, భాజపా నేత

ETELA: 'తెరాస ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని ప్రజలు భావిస్తున్నారు'

ఇదీ చదవండి: REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details