సీఎం కేసీఆర్ ప్రతిష్ఠ, గౌరవం మసకబారిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠ అధోపాతాళానికి పడిపోయిందని ఆయన ఆరోపించారు. సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని ఈటల విమర్శించారు. హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే రూ.40-45 వేల కోట్లు చెల్లించాలని తెలిపారు. ఎవరు ఎన్ని చేసినా హుజూరాబాద్‌లో ఎగిరేది కమలం జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గర్వపడుతున్నా..
ముఖ్యమంత్రి ప్రతిష్ఠ, గౌరవం ఇవాళ అధఃపాతాళానికి పడిపోయింది. కేసీఆర్ పాలనలో హుజూరాబాద్‌లో ఏం జరిగిందంటే.. వందల కోట్ల రూపాయలు పెట్టిండు. సొంత పార్టీలోని మనుషులనే కొన్న చరిత్ర ఇవాళ కేసీఆర్‌కు మాత్రమే దక్కింది. ఒక ఈటల రాజేందర్‌ను ఓడిగొట్టాలని కుంచితపు బుద్ధితో చేసిన పనులు, నిర్ణయాలు నా జాతికి, రాష్ట్రానికి అక్కరకు వచ్చినట్లుగా భావిస్తా ఉన్నా. ఆ ఫలితాలు వాళ్లకు అందుతున్నందుకు నేను గర్వపడుతున్నా. నా ఎమ్మెల్యే రాజీనామా ఫలితాల కన్నా.. ఇప్పుడు వస్తున్న ఫలితాలను చూసి గర్వపడుతున్నా. -ఈటల రాజేందర్, భాజపా నేత
ETELA RAJENDER: "కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే 'దళితబంధు' రాష్ట్రమంతా అమలుచేయాలి" ఇదీ చదవండి: kishan reddy: 'జనాభా ఎక్కువున్న దేశంలో కరోనాను ఎదుర్కోవడం కష్టమే'