కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల పర్యటించారు. జమ్మికుంటలోని అయ్యప్పస్వామి దేవాలయంలో జోడు నాగేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వేద పండితులు మంత్రి ఈటలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. టెంకాయలు కొట్టి.. ప్రత్యేక పూజలు చేశారు.
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఈటల - karimnagar news
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలోని అయ్యప్పస్వామి దేవాలయంలో జోడు నాగేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. వేద పండితులు మంత్రి ఈటలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రైలు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందగా.. ఆ రైతు కుటుంబాలను మంత్రి ఈటల పరామర్శించారు.

జమ్మికుంట మండలం మాచినపల్లిలోని పలువురు రైతులకు చెందిన గొర్రెలు రైలు ప్రమాదంలో మృతి చెందగా.. ఆ రైతు కుటుంబాలను మంత్రి ఈటల పరామర్శించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, తెరాస రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దక్షిణ మధ్య రైల్వేకు మూడు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు