తెలంగాణ

telangana

ETV Bharat / state

ETELA RAJENDER: హుజూరాబాద్‌లో ఈటల పాదయాత్ర - తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్(ETALA RAJENDER) ప్రకటించారు. బత్తినివానిపల్లె నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఉప ఎన్నికల్లో(by-election) గెలుపే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్నారు.

ETALA RAJENDER, padayatra
ఈటల రాజేందర్, ఈటల రాజేందర్ పాదయాత్ర

By

Published : Jul 10, 2021, 5:52 PM IST

Updated : Jul 10, 2021, 10:54 PM IST

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు మాజీమంత్రి ఈటల రాజేందర్‌(ETALA RAJENDER) ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో కమలాపూర్‌ మండలం బత్తినివానిపల్లె నుంచి పాదయాత్ర(padayatra)కు శ్రీకారం చుట్టనున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో(by election) విజయమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న ఈటల... ప్రజలకు మరింత చేరువకావాలనే లక్ష్యంతో పాదయాత్రకు పూనుకున్నారు.

కమలం గూటికి ఈటల

పేదలకు చెందిన అసైన్డ్‌ భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు, మంత్రిపదవి నుంచి భర్తరఫ్‌తో... తెరాసకు ఈటల రాజేందర్‌ గుడ్‌బై చెప్పారు. అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్(Former minister etela rajender) కమలం గూటికి (Joined in BJP) చేరారు.

గెలుపు భాజపాదే

హుజూరాబాద్‌లో​ ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేది భారతీయ జనతా పార్టీ(bjp)నే అని ఈటల రాజేందర్​ మొదటి నుంచి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అణచివేత ధోరణికి చరమగీతం పాడాలని హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. హుజూరాబాద్​లో తనను ఓడించేందుకు కేసీఆర్​ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

తెరాసపై ఫైర్

ఎన్నిరకాలుగా బెదిరించినా తాను గెలవడం ఖాయమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ వైపు చూస్తున్నారని, డబ్బు, ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందన్నారు. తమ వైపు తిరిగే యువకులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి ఒక్కరిని బెదిరించి తెరాస కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా, భాజపా కార్యకర్తలను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల హెచ్చరించారు.

ఇదీ చదవండి:ETALA: 'దొంగ ఓట్లు నమోదు చేసి నన్ను ఓడించేందుకు కుట్ర'

Last Updated : Jul 10, 2021, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details